Thursday, November 12, 2020

News Topic

 Daily Head Lines [Source: Telugu News]

1.అబ్దుల్ సలాం విషయంలో ఒవైసీ సైలెంట్.. బీజేపీ వ్యూహమా?

2.ఇండియాకు మద్దతిస్తూ, పాకిస్థాన్ కు కౌంటరిచ్చిన రష్యా



New Districts Information in Andra Pradesh

ఏపీలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ గడిచిన ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వైసీపీ చెప్పింది. కానీ.. ఇప్పుడు కొత్త జిల్లాల సంఖ్య 17కు మించే పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాలను ఆధారంగా చేసుకుని జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 32కు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. పార్లమెంట్ స్థానాలతో పాటు స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని అసెంబ్లీ నియోజవర్గాలను కూడా జిల్లాలుగా మార్చాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్(ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనంటూ ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. ఆ జాబితాపై మీరూ ఓ లుక్కేయండి.


రాయలసీమ:

1.కడప(జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప)

2. రాజంపేట(బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి)

3. కర్నూలు(నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు)

4. ఆదోని(పత్తికొండ, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు)

5. నంద్యాల( శ్రీశైలం, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, పాణ్యం)

6. అనంతపురం(రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమల, రాప్తాడు, తాడిపత్రి)

7. హిందూపురం(ధర్మవరం, కదిరి, పెనుగొండ, మడకశిర, హిందూపురం, పుట్టపర్తి)

8. చిత్తూరు(పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు)

9. మదనపల్లి(పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి)

10. తిరుపతి(శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, నగరి, సత్యవేడు)


కోస్తాంధ్ర:

11. గుంటూరు(తెనాలి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు, ప్రత్తిపాడు)

12. బాపట్ల(రేపల్లె, చీరాల, పర్చూరు, బాపట్ల, వేమూరు)

13. నరసరావుపేట(చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, గురజాల)

14. అమరావతి(నందిగామ, జగ్గయ్యపేట, తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు) 

15. ఒంగోలు(అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు, ఒంగోలు)

16. మార్కాపురం(గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం)

17. నెల్లూరు(కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి, కొవ్వూరు)

18. గూడూరు(సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట)

19. మచిలీపట్నం(కైకలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు)

20. ఏలూరు(పోలవరం, చింతలపూడి, గోపాలపురం, ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు)

21. విజయవాడ(నూజివీడు, తిరువూరు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం)

22. కాకినాడ(పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రామచంద్రపురం, పెద్దాపురం)

23. రాజమండ్రి(అనపర్తి, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం)

24. అమలాపురం(ముమ్మిడివరం, పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, కొత్తపేట, మండపేట)

25. నరసాపురం(ఆచంట, పాలకొల్లు, తణుకు, నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, భీమవరం)


ఉత్తరాంధ్ర:

26. విశాఖపట్నం(భీమిలి, గాజువాక, పెందుర్తి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్)

27. అనకాపల్లి(చోడవరం, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి, తుని, పాయకరావుపేట)

28. అరకు(పాడేరు, అరకు, జి.మాడుగుల)

29. విజయనగరం(చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, శృంగవరపుకోట)

30. పార్వతీపురం(కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ)

31. శ్రీకాకుళం(ఆముదాలవలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం)

32. పలాస(పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, పలాస)